Indian-Expat-molests-5yr-old-child

ఐదేళ్ల పిల్లాడిని కౌగిలించుకొని.. మర్మాంగాలను తడుముతూ.. బంధువుల కంటపడ్డ ప్రవాసీ..

దుబాయి: ఇటీవలే పని కోసం దుబాయికి వెళ్లిందో భారతీయ కుటుంబం. అక్కడ ఓ షేరింగ్ విల్లాలో దిగింది. ఉద్యోగం గురించి ఏజెంట్లకు ఫోన్లు చేస్తూ పిల్లలను పెద్దవాళ్లెవరూ పట్టించుకోలేదు. తోటలో ఆడుకుంటున్న పిల్లలను పిలవాలని అక్క చెప్పడంతో బయటకు వచ్చాడా యువకుడు. ఏజెంట్‌తో మాట్లాడి మేనల్లుడిని పిలవసాగాడు. పిల్లాడు కనిపించకపోవడంతో విల్లా అంతా వెదకసాగాడు. ఇంతలో ఓ చోట తన మేనల్లుడి గొంతు వినిపించింది. అక్కడకు వెళ్లి ఎదురుగా ఉన్న దృశ్యం చూసి షాకైపోయాడు.

ఎందుకంటే ఎవరో ఓ వ్యక్తి ఐదేళ్ల తన మేనల్లుడిని కౌగిలించుకొని, అతని మర్మాంగాలను తడుముతున్నాడు. అంతేగాక ఈ దృశ్యాలను మొబైల్‌లో వీడియో తీస్తున్నాడు. ఈ షాక్ నుంచి తేరుకున్న ఆ యువకుడు పెద్దగా కేకలు వేయడంతో.. ఆ పిల్లాడిని వేధిస్తున్న దుండగుడు పారిపోయాడు. ఈ విషయం తెలిసిన బాలుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టుచేశారు. నిందితుడు కూడా భారత్‌కు చెందినవాడేనని, అతనికి 15ఏళ్లపాటు జైలుశిక్ష పడే అవకాశముందని అధికారులు తెలిపారు.