Indian-engineer-awarded-by-Britain-prince

బ్రిటన్ యువరాజు చేతుల మీదుగా.. భారత ఇంజనీర్‌కు అరుదైన గౌరవం..

లండన్‌, జూన్‌ 18: నేటికీ ఎన్నో సర్కారీ ఆస్పత్రుల్లో ఐసీయూ వసతి లేక.. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందితో ఏటా లక్షలాది మంది నవజాత శిశువులు పుట్టిన కొన్ని గంటల్లోనే కన్నుమూస్తున్నారు. ఈ మరణాలను ఆపేందుకు ‘కంటిన్యుయస్‌ పాజిటివ్‌ ఎయిర్‌వే ప్రెషర్‌’(సీపీఏపీ) పరికరాన్ని ఆవిష్కరించిన ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీర్‌ నితేశ్‌కుమార్‌ జాంగీర్‌కు అరుదైన గౌరవం దక్కింది. 2019 సంవత్సరానికి కామన్వెల్త్‌ సెక్రటరీ జనరల్‌ ‘ఇన్నొవేషన్‌ ఫర్‌ సస్టయినబుల్‌ డెవల్‌పమెంట్‌’ అవార్డు ఆయన్ను వరించింది. బ్రిటన్‌ యువరాజు హ్యారీ చేతులమీదుగా నితేశ్‌ ఈ అవార్డును అందుకున్నారు.