Indian-American-Teen-Named-Junior-Partner-

భారతీయ అమెరికన్‌కు చిన్న వయసులోనే పెద్ద గుర్తింపు..

న్యూజెర్సీ: అంతర్జాతీయ సంస్థలో రిషి భాగరియా(18) అనే భారతీయుడికి భాగస్వామ్యం లభించింది. ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలోనే రిషి స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధించిన మెలకువలను తెలుసుకున్నాడు. అప్పటి నుంచి స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై పట్టు సాధించాడు. అందుకు తన సోదరుడు, అంకుల్ సాయం చేశారన్నాడు. వారిద్దరూ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే సంస్థలో సలహాదారులుగా పనిచేస్తున్నారని రిషి చెబుతున్నాడు. వారి ప్రోద్భలం వల్లే తాను అతి చిన్న వయసులో అంతర్జాతీయ సంస్థ థెస్సాల్స్ క్యాపిటల్‌లో భాగస్వామిని అయ్యానన్నాడు. థెస్సాల్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మైకేల్ మాట్లాడుతూ రిషిలో అద్భుతమైన ప్రతిభ దాగి ఉందన్నారు. దానికి గుర్తింపు దక్కిందన్నారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై చిన్న వయసులోనే పట్టు సాధించడమంటే మాములు విషయం కాదన్నారు. ఎంతో తపన ఉంటే తప్ప అది సాధ్యం కాదన్నారు. భవిష్యత్తులో రిషి ఉన్నత స్థానాలను అధిరోహిస్తాడని ఆయన తెలిపారు.