Husband-buried-his-wife-alive-in-concrete-shallow-grave-

భార్య విడాకులు అడిగిందని.. భర్త ఏం చేశాడంటే..

మెక్సికో: భార్య విడాకులు అడిగిందని.. మెక్సికోలో ఈవిల్ రేనే అనే వ్యక్తి కట్టుకున్న భార్యను బతికుండగానే పూడ్చేశాడు. మెక్సికో చట్టాల ప్రకారం భార్యకు విడాకులిస్తే ఆస్తిలో కూడా భాగం ఇవ్వాలనే కారణంతో భర్త ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు. ఈవిల్ రేనే తన తమ్ముడు మరో ఐదుగురితో కలిసి పక్కా ప్రణాళికతో ఈ పని చేసినట్టు పోలీసులు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం.. మహిళ కారులో వెళుతుండగా.. ఆమె ఓ ప్రదేశంలో కారు దిగేలా చిన్న యాక్సిడెంట్ డ్రామా ఆడారు. మహిళ కారు దిగిన వెంటనే ఆమె చేతులను కట్టేసి ఈవిల్ తమ్ముడికి చెందిన స్థలానికి తీసుకెళ్లి ముందుగానే తీసిన గోతిలో పడేశారు. అనంతరం ఆమెపై మట్టి, సిమెంట్‌ పోసి పూడ్చేశారు. 2014లో జరిగిన ఈ ఘటన ఇటీవలే వెలుగులోకి రావడంతో పోలీసులు నేరానికి పాల్పడిన ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టులో నిలబెట్టారు. జడ్జి ఏడుగురికి 51 ఏళ్ల శిక్ష వేశారు. మృతురాలి కుటుంబానికి దాదాపు 12 లక్షల నష్టపరిహారం కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.