Huge-Snake-Falls-From-Ceiling-To-Bed

పైకప్పు నుంచి మంచం మీద పడ్డ కొండచిలువ

క్వీన్స్‌ల్యాండ్: గోడ మీద ఉన్న బల్లి నేల మీద పడితేనే చాలా ఇళ్లలో భయపడుతుంటారు. అలాంటిది ఓ పెద్ద కొండచిలువ సీలింగ్ నుంచి గదిలోని మంచం మీద పడితే? ఊహించుకుంటేనే భయం పడుతుంది కదూ. ఆస్ట్రేలియాలోని ఓ ఇంట్లో ఈ ఘటన నిజంగా జరిగింది. అయితే ఆ సంఘటన జరిగినప్పుడు మంచం మీద ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇంట్లో వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం.. కొండచిలువ బెడ్‌రూం సీలింగ్‌కు ఉన్న లైట్ ఫిట్టింగ్‌లో ఉంది. కొండచిలువ బరువును పైనున్న లైట్ ఫిట్టింగ్ మోయలేకపోవడంతో కొండచిలువ కింద ఉన్న మంచంపై పడిపోయింది. మంచంపై కొండచిలువను చూడగానే.. గుండె ఆగినంత పనైందని ఇంట్లో వారు చెబుతున్నారు. వెంటనే పాములు పట్టే వారికి ఫోన్ చేయగా.. వారు వచ్చి కొండచిలువను స్వాధీనం చేసుకున్నారు. స్నేక్ క్యాచర్స్ తమ ఫేస్‌బుక్ పేజీలో ఈ ఫొటోలను పోస్ట్ చేయడంతో నెటిజన్ల నుంచి విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి. ఆ మంచం మీద ఎవరైనా ఉండి ఉంటే.. ఆ నిమిషంలో వారి పరిస్థితి ఏంటో? అని చాలా మంది కామెంట్లు చేశారు.  

Related Articles