Hindu-student-been-sexually-assaulted-in-pakistan

పాక్‌లో హిందూ విద్యార్థినిపై అమానుషం.. ఆత్మహత్యగా చిత్రీకరించి..

ఇస్లామాబాద్‌, నవంబరు 7: పాకిస్థాన్‌లో గత సెప్టెంబరులో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన హిందూ వైద్య విద్యార్థినిపై హత్యాచారం జరిగిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ విషయాన్ని వైద్యులు ధ్రువీకరించారు. సింధ్‌ ప్రావిన్స్‌లోని బీబీ అసీఫా డెంటల్‌ కాలేజీలో చదువుతున్న నిమ్రిత చాందినీ సెప్టెంబరు 16న ఎంతసేపటికీ తన గదిలోంచి బయటకు రాలేదు. దాంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయి ఉంది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు, నిరసనల కారణంగా సింధ్‌ హైకోర్టు సెప్టెంబరు 18న న్యాయ విచారణకు ఆదేశించింది.