Greater-Richmond-Telugu-Association-Bathukamma-Sambaralu

గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

వర్జీనియా: గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో హిందు సెంటర్ ఆఫ్ వర్జీనియాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలంతా రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలు పేర్చి, కోలాటం ఆడారు. భారీగా తరలివచ్చిన తెలుగు మహిళలు ఆటపాటలతో అలరించారు. ఈ వేడుకలకు స్థానికంగా ఉంటున్న ప్రవాసీలంతా క్యూకట్టారు. సుమారు 700 మంది వరకు ప్రవాసీలు ఈ సంబరాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్ మాకినేనితో పాటు రాజ్ గడ్డం , విజయ్ వేమూరి, క్రిష్ణ రెడ్డి, రాజు కొచర్లపాటి, శ్రీకాంత్ పెద్దిరెడ్డి, రమేష్ రెడ్డి, రాజ్ గొర్రె, రవి నాగులగారి, మెహర్, హసిత, మంజుల కుందవరం, క్రిష్ణ కుందనూరి, జలేందర్, శ్రీదర్ దొంగర, బాల్ రెడ్డి, రాజేంద్రప్రసాద్, కిరణ్ చాడ, వెంకట్ వెనిగళ్ళ, కౌంటీ అధ్యక్షులు టామి బ్రానిన్, రియాల్టర్లు రవి గుత్తా, విజయ్, నీరజ , డీజే చిరు, స్పెక్ట్రం డెకార్స్ శ్రుతి, ఫొటోగ్రఫి బాను, వాసు, బాలగట్ల వినయ్, సుదేంద్ర, మహేష్ మట్టెంపాటి అన్వేష్  పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఘనంగా నిర్వహించిన హిందు సెంటర్ వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.