Gold-Smugglers-Found-new-way-to

కారు విడిభాగంలో బంగారం తరలింపు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 2 కేజీలు పట్టివేత
శంషాబాద్‌: బంగారం అక్రమ రవాణాదారులు కస్టమ్స్‌ అధికారుల కళ్లుగప్పేందుకు రోజుకో కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. తాజాగా బంగారాన్ని కారు విడిభాగంలో అమర్చి రవాణా చేస్తుండగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. షార్జా నుంచి వచ్చిన విమాన ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఓ ప్రయాణికుడి వద్ద కారు ఇంజన్‌లోని విడిభాగాలు లభించాయి. వాటిని స్కాన్‌చేయగా బంగారం బయటపడింది. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని బంగారాన్ని తూకం వేయగా 2.3 కేజీలుగా తేలింది.