Global-Peace-index-2019

శాంతియుత దేశాల జాబితాలో భారత్ స్థానమిది!

5 స్థానాలు తగ్గి 141వ ర్యాంకుకు చేరిక
  • 12వ సారి నంబర్‌వన్‌గా ఐస్‌ల్యాండ్‌
  • జాబితాలో చిట్టచివరన అఫ్ఘనిస్థాన్‌
న్యూఢిల్లీ: ప్రపంచ శాంతి సూచీ-2019లో భారత్‌ ర్యాంకు దిగజారింది. గత ఏడాదితో పోలిస్తే భారత్‌ 5 స్థానాలు వెనక్కి తగ్గి 141వ స్థానానికి చేరింది. 163 దేశాల్లోని శాంతియుత పరిస్థితులపై ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పీస్‌ అనే ఆస్ట్రేలియాకు చెందిన మేథో సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం అత్యంత ప్రశాంత దేశంగా ఐస్‌ల్యాండ్‌ 12వ సారి నంబర్‌వన్‌గా నిలిచింది. ఇక అశాంతితో రగిలిపోతూ ఎప్పుడూ ర్యాంకింగ్స్‌లో చిట్టచివరన ఉండే సిరియా ఒక ర్యాంకు మెరుగుపడింది. చివరి స్థానం నుంచి 162కు చేరుకుంది. హింసాత్మక ఘటనలతో అఫ్ఘానిస్థాన్‌ జాబితాలో చివరి స్థానంలో మిగిలిపోయింది. ఇక దాయాదీ దేశం పాకిస్థాన్‌ 153వ స్థానంలో నిలిచింది. ఈ సర్వే ప్రకారం ప్రపంచ సరాసరితో పోలిస్తే దక్షిణాసియాలో శాంతి సూచీ తక్కువగా ఉంది. గడిచిన ఏడాదితో పోలిస్తే పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌, భారత్‌లో అంతర్గత సంఘర్షణలు పెరగడమే అందుకు కారణమని సర్వే తెలిపింది.
 
శాంతియుత దేశాలు
ఐస్‌ల్యాండ్‌(1), న్యూజిలాండ్‌(2), ఆస్ట్రేలియా(3), పోర్చుగల్‌(4), డెన్మార్క్‌(5)
 
దక్షిణాసియాలో
శాంతి దేశాలు
భూటాన్‌(15), శ్రీలంక(72), నేపాల్‌(76), బంగ్లాదేశ్‌(101)
 
ప్రమాదకర దేశాలు
అఫ్ఘానిస్థాన్‌(163), సిరియా(162), సౌత్‌ సూడాన్‌(161), యెమెన్‌(160), ఇరాక్‌(159)
 
వాతావరణ ముప్పు అధికం
ఫిలిప్పీన్స్‌, జపాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, చైనా, ఇండోనేసియా, భారత్‌, వియత్నాం, పాకిస్థాన్‌
 
సైన్యానికే ఎక్కువ ఖర్చు
అమెరికా, చైనా, భారత్‌, సౌదీ అరేబియా, రష్యా
శాంతి సూచీలో
భారత ర్యాంకులు
సంవత్సరం ర్యాంకు
2019 141
2018 136
2017 137
2016 141
2015 143