Genius-husband-buys-a-tarantula-to-stop-arachnophobe-mother-in-law-from-visiting

అత్తమామలు రోజూ ఇంటికొస్తున్నారని.. తెలివైన అల్లుడు ఏం చేశాడంటే..

యూకే: చాలా మంది అల్లుళ్లకు తమ అత్తమామలంటే పెద్దగా ఇష్టముండదు. ఏ పండగకో వస్తేనే ఎందుకొచ్చారా అని అనుకునే అల్లుళ్లు చాలా మందే ఉంటారు. అత్తమామలు తనకు ప్రైవసీ లేకుండా చేస్తున్నారని యూకేలో ఓ వ్యక్తి వాళ్లను ఇంటికి రాకుండా చేసేందుకు ఓ మార్గాన్ని కనుగొన్నాడు. ఎప్పుడో ఒకసారి వస్తే పర్లేదు కానీ.. నిత్యం వస్తుంటూ చాలా ఇబ్బందిగా ఉందంటూ ఆవేదన చెందిన ఆ వ్యక్తి ఓ సాలీడును కొన్నాడు. సాలీడుకు అత్తమామలు ఇంటికి రావడానికి సంబంధం ఏంటంటారా? తన అత్తకు అరక్నాఫోబిక్(సాలీడు అంటే భయపడేవారు) ఉందని గ్రహించిన అల్లుడు తన ఇంట్లో సాలీడు ఉంటే అత్త ఇంటికి రావడం మానేస్తుందని తెలుసుకున్నాడు. తన మావయ్య రోజూ వస్తునప్పటికీ.. ఆయనతో పెద్ద సమస్య తలెత్తడం లేదని, కానీ అత్త మాత్రం నరకం చూపిస్తోందని ఆవేదన చెంది తాను ఈ సాలీడు కొన్నట్టు అల్లుడు చెప్పాడు. సాలీడు కొన్ననాటి నుంచి అత్త ఇంటికి రావడం మనేసిందని.. సాలీడు మహిమ చాలా బాగా పనిచేసిందని అల్లుడు ఓ సోషల్ న్యూస్ వెబ్‌సైట్‌లో తన ఫీలింగ్స్‌ను వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టాడు. తాను చేస్తోంది తప్పా అంటూ కాప్షన్ పెట్టినప్పటికీ.. పోస్ట్‌కు స్పందించిన చాలా మంది తాను చేసిన దాంట్లో పెద్ద తప్పేమి లేదని సమాధానమిచ్చారు.