Frankford-Autoshow-catches-every-car-geeks-heart

చూపు తిప్పకోనివ్వని కార్ల అందాలు.. ఫ్రాంక్‌ఫర్ట్‌ ఆటోషో స్టార్ట్..

బెర్లిన్: ‘అదేదో జేమ్స్‌బాండ్ కారులా లేదూ’.. ‘అబ్బో ఈ కారు ఫీచర్ అదుర్స్’ అంటూ అక్కడ చేరిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ముందుకు నడిచే కొద్దీ వారి ఆశ్చర్యానికి అంతులేకుండా పోతోంది. అంత అద్భుతంగా ప్రారంభమైంది ఫ్రాంక్‌ఫర్ట్‌ ఆటోషో. జర్మనీలో అట్టహాసంగా ప్రారంభమైన ఈ షో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతర్జాతీయ ఆటోమొబైల్‌ దిగ్గజ సంస్థలు తమ కాన్సెప్ట్‌ కార్లతో పాటు కొత్త మోడళ్లను ఈ వేదికపై ప్రదర్శించాయి. వాటిని చూసిన చూపరులు కళ్లు తిప్పుకోలేకపోతున్నారు. ఇంత అద్భుతమైన కార్లన్నీ ఒకే చోట చేరడంతో ఇదో చెప్పలేని అనుభూతినిస్తోందని వీక్షకులంటున్నారు. కొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలను కూడా ప్రదర్శించాయి. లంబోర్ఘినీ, పోర్షే, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్‌ అండ్‌ లాండ్‌ రోవర్‌, మెర్సిడెస్‌ బెంజ్‌, హోండా, హ్యుండయ్‌ తదితర కంపెనీలు.. ప్రెస్‌ డే సందర్భంగా తమ కాన్సెప్ట్‌ కార్లతో హల్‌చల్‌ చేశాయి. ఈ నెల 12 నుంచి 22 వ తేదీ వరకు ఈ ఆటోషో కనువిందు చేయనుంది.