Foreign-currency-worth-Rs-1-48-crore-concealed-in-sweet-boxes-seized-at-Hyderabad-airport

స్వీట్‌బాక్స్‌లో రూ. కోటి 48 లక్షలు.. పట్టుకున్న శంషాబాద్ అధికారులు

హైదరాబాద్: స్వీట్‌బాక్స్‌లో అక్రమంగా తరలిస్తున్న 3.50 లక్షల సౌదీ రియాల్స్‌(రూ. కోటి 48 లక్షలు)ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇద్దరు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంలో అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనున్న బ్యాగ్‌లను, వస్తువులను తనిఖీ చేయగా.. స్వీట్ బాక్స్‌ల్లో సౌదీ రియాల్స్‌ పట్టుబడ్డాయి. దీంతో అధికారులు ఆ రియాల్స్‌ను స్వాధీనం చేసుకొని, ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కాగా, వీరిద్దరూ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమామనంలో వచ్చినట్లు తెలుస్తోంది.

Related Articles