foreign-currency

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ కరెన్సీ స్వాధీనం

శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. గురువారం ఉదయం సీఐఎస్‌ఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా శంషాబాద్ నుంచి షార్జా వెళ్తున్న ఓ మహిళ బ్యాగులో 28 లక్షల 50వేల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మహిళను విచారణ నిమిత్తం డీఆర్ఐ అధికారులకు సీఐఎస్‌ఎఫ్ పోలీసులు అప్పగించారు.