Fly-from-UAE-to-India-for-just..

గల్ఫ్‌లోని భారతీయులకు శుభవార్త చెప్పిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..!

దుబాయి: పొట్టకూటి కోసం దుబాయి వెళ్లి.. స్వదేశానికి తిరిగి రావాలని ఉన్నా, ఆర్థిక పరిస్థితుల కారణంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న భారతీయులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సంస్థ శుభవార్త చెప్పింది. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న వారి కోసం ఫ్లాష్ సేల్‌ను ప్రారంభించిన సంస్థ.. తక్కువ ఖర్చుతో ఇండియాకు వచ్చేందుకు వీలు కల్పించింది. కేవలం 269దిర్హామ్స్‌ (సుమారు రూ. 5,200)తో షార్జా నుంచి ముంబాయికు ప్రయాణించొచ్చని వెల్లడించింది. అంతేకాకుండా.. దుబాయ్-ముంబాయి టికెట్ ధర 289 దిర్హామ్స్ (సుమారు రూ.5,600), దుబాయి/షార్జా - కొజికోడ్‌ టికెట్ ధర 279 ( సుమారు రూ.5,400) దిర్హామ్స్‌గా నిర్ణయించినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ ప్రకటించింది. అయితే ఈ ఫ్లాష్ సేల్ ఫిబ్రవరి 6-10 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. ఈ తేదీల మధ్య టికెట్‌ను బుక్ చేసుకున్న వారు ఫిబ్రవరి 6- అక్టోబర్ 24 మధ్య కాలంలో ప్రయాణించొచ్చని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ వెల్లడించింది.