Florida-man-wins-10K-dollars-a-week-for-life-lottery-game

బంపరాఫర్.. ఆ అమెరికన్‌కు బతికినంతకాలం.. వారానికి రూ.7లక్షలు

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఎవాంజెలోస్ హాకియాస్ అనే వ్యక్తి ఎప్పట్లాగే ఉద్యోగం నుంచి ఇంటికెళ్తున్నాడు. దారిలో టంపాలో ఓ పెట్రోల్ బంకు వద్ద ఆగిన అతను.. దగ్గరలోని స్టోర్‌లో 20 డాలర్లు(రూ.1400పైగా) పెట్టి ఓ లాటరీ టికెట్ కొన్నాడు. ఈ చిన్న పనే అతని జీవితాన్ని మార్చేసింది. 50 లక్షల మందిలో అతన్నే విజేతగా నిలిపింది. ఈ లాటరీ వివిధ స్థాయుల్లో డబ్బును పంచుతుంది. ఇలా యాభై లక్షల మందిలో ఒకరికి మాత్రం జీవితాంతం వారానికి పదివేల డాలర్లు(రూ.7లక్షలపైగా) అందిస్తుంది. ఇదిగో ఇదే అవకాశం వచ్చింది 49 ఏళ్ల ఎవాంజెలోస్‌కు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అతని ఆనందానికి అవధుల్లేవు.  అయితే తనకు వారం వారం సొమ్ము అందివ్వనక్కర్లేదన్న ఎవాంజెలోస్.. ఒకేసారి మొత్తంగా  ఎనిమిదిన్నర లక్షల డాలర్లు(రూ.60కోట్లపైగా) ఇవ్వాలని లాటరీ నిర్వాహకులను కోరాడు. దీనికి వారు అంగీకరించారు.