Florida-man-steals-2.5cr-for-a-webcam-model

మూడు నెలల్లో కోటిన్నర దొంగతనం.. ప్రేయసి కోసం ఖర్చు.. విషయం ఇంట్లో తెలిసి..

ఫ్లోరిడా: అతని పేరు ఓర్లాండో సెంటినెల్. అమెరికాలోని ఫ్లోరిడావాసి. గతేడాది అక్టోబరులో ఆన్‌లైన్లో అతనికి ఓ మోడల్ పరిచయం అయింది. బల్గేరియాకు చెందిన ఆమె ఓ అడల్ట్ వెబ్‌సైట్‌లో పనిచేస్తోంది. ఆమెతో ప్రేమలో పడిన ఓర్లాండో.. ఆమెకు ఇవ్వాలని తన అన్న వద్ద నుంచి 60వేల డాలర్లు(రూ.42లక్షలపైగా) దొంగతనం చేశాడు. అదే సమయంలో అన్నవాళ్ల ఇంట్లో ఉన్న కొన్ని తుపాకులు కూడా అతని కంటపడ్డాయి. వాటిని కూడా తర్వాత అమ్ముకోవచ్చని తీసుకున్నాడు. అమ్మానాన్నలు దాచుకున్న డబ్బును కూడా దోచుకున్నాడు. అలానే వారి పేరిటే ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి కొంత సొమ్ము చేసుకున్నాడు. ఇలా మొత్తం 2వేల డాలర్లపైగా(రూ.కోటిన్నరపైగా) పోగుచేసి ఆన్‌లైన్లో పరిచయమైన మోడల్‌కు పంపించేశాడు.

 

ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలియడంతో వారికి విపరీతమైన కోపం వచ్చింది. ఓర్లాండోను చెడామడా తిట్టేసి, ఆ మోడల్‌తో మాట్లాడటానికి వీల్లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఓర్లాండో ఓ అర్థరాత్రి నిద్రలో ఉన్న తల్లిదండ్రులను, అన్నను కిరాతకంగా కాల్చిపారేశాడు. దీనికోసం అన్నవాళ్ల ఇంట్లో దొరికిన తుపాకులనే వాడాడు. ఈ హింసాకాండ గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఓర్లాండోను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ లాయరు.. ఓర్లాండోకు ఉరిశిక్ష వేయాలని కోరారు. కానీ దీనికి కోర్టు జ్యూరీ సభ్యులంతా అంగీకరించలేదు. దీంతో ఓర్లాండోకు జీవితఖైదు విధిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.