Florida-Man-Fights-With-Alligator-to-Save-His-Pet-Dog

పెంపుడు కుక్క కోసం మొసలితో డేంజరస్ ఫైట్.. ఫ్లోరిడా వ్యక్తి సాహసం..

ఫ్లోరిడా: కూతురి పెంపుడు శునకం కోసం ఓ తండ్రి తన ప్రాణాలకు తెగించి మొసలితో కలబడిన భయానక సంఘటన ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. 75 ఏళ్ల బడ్డీ అకెర్మాన్ ఫ్లోరిడాలోని తన ఇంటి సమీపంలో ఉండే సరస్సులోని ఏడు అడుగుల మొసలితో పోరాడి శునకం ప్రాణాలు కాపాడాడు. అసలేం జరిగిందంటే... బడ్డీ కూతురు వేరే ఊరికి వెళ్తుండడంతో తన పెట్ ఓసిని ఆయన వద్ద ఉంచింది. అయితే బడ్డీ ఇంట్లో ఉండగా ఓసి సరస్సు వద్దకు వెళ్లి నిలబడింది. అంతే లోపల నుంచి వచ్చిన ఏడు అడుగుల మొసలి ఓసి వెనక భాగం పట్టుకొని నీటిలోకి లాక్కెళ్లేందుకు యత్నించింది. దాంతో ఓసి గట్టిగా అరవడం విన్నా బడ్డీ బయటకు వచ్చి చూశాడు. ఓసిని మొసలి నోట కరచుకోవడం చూసి వెంటనే పెద్ద కర్రతో దానిపై విరుచుకుపడ్డాడు. దాంతో ఓసిని మొసలి వదిలేసి నోటిలోకి వెళ్లిపోయింది. మొసలి దాడిలో ఓసి స్వల్పంగా గాయపడినట్లు బడ్డీ తెలిపారు. ఇక తన పెంపుడు కుక్క కోసం తండ్రి చేసిన పోరటాన్ని కూతురు జుడీ కొనియాడింది. రియల్ హీరో అంటూ పొగడ్తల వర్షం కురిపించింది.