Florida-elementary-teacher-accused-of-creating-child-porn-

బాయ్‌ఫ్రెండు కోసం చిన్న పిల్లలను వాడుకున్న టీచర్.. ఫ్లోరిడాలో నీచం

ఫ్లోరిడా: ఓ ఎలిమెంటరీ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నఅడ్రా మాబెల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు వివాహితుడైన ఆమె మాజీ ప్రియుడు జస్టిన్ రిచీ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు వారు వెల్లడించారు. ఎందుకంటే వీరిద్దరూ పసిపిల్లలపై లైంగిక దాడులకు పాల్పడ్డారు. అసలు ఇదంతా ఎలా బయటకు వచ్చిందో తెలుసా? జస్టిన్ ఇంటి దగ్గర ఉన్న ఓ మహిళ తన పిల్లలకు ఓ రోజు సాయంత్రం స్నానం చేయిస్తోంది. వారిలో 1 సంవత్సరపు పాప, 4 సంవత్సరాల అమ్మాయి కూడా ఉన్నారు. వీరిద్దరూ తమ ఇంటి దగ్గరలో నివాసముంటున్న జస్టిస్ తమపై అక్కడక్కడా చేతులు వేసినట్లు తల్లికి చెప్పారు. దాంతో షాకైన ఆమె వారిని ప్రశ్నించి మరిన్ని వివరాలు తెలుసుకొంది. వారిని జస్టిన్ లైంగికంగా వేధించాడని రూఢి చేసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే అక్కడకి చేరుకున్న పోలీసులు జస్టిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వస్తువులు పరిశీలించిన పోలీసులకు జస్టిన్ ఫోన్‌లో చిన్న పిల్లల నీలి చిత్రాలు కనిపించాయి. అవి ఎక్కడివని గట్టిగా ప్రశ్నించగా, తన మాజీ ప్రియురాలు తనకు వాటిని పంపినట్లు అతను చెప్పాడు. ఆ సాక్ష్యాలతో ఆడ్రాను కూడా పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా ఆమెను ప్రశ్నిచంగా తాను నిజంగానే 1 సంవత్సరం ఉన్న అమ్మాయిపై లైంగిక దాడి చేసి దాన్ని వీడియో తీసినట్లు ఒప్పుకొంది. ఆమె టీచర్‌గా ఉన్న స్కూల్లోని చాలామంది అమ్మాయిలతో తాను అలానే చేసినట్లు వెల్లడించింది. ఇదంతా తాను తన బాయఫ్రెండు జస్టిన్ కోసమే చేసినట్లు, తమిద్దరికీ చైల్డ పోర్న అంటే తెగ ఇష్టమని తెలిపింది. వీరిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు.