Filipina-maid-tied-to-a-tree-by-rich-Saudi-boss

ఖరీదైన ఫర్నీచర్ ఎండలో ఉంచేసిందని.. సౌదీ యజమాని ఏం చేశాడంటే..

సౌదీ: సౌదీ అరేబియాలో వలసదారులను ఏ విధంగా చిత్రహింసలకు గురిచేస్తారో కొత్తగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా భారత్ నుంచి సౌదీ దేశాలకు వెళ్లే వారిలో సగానికి సగం మంది అక్కడ నరకయాతన అనుభవిస్తూనే ఉన్నారు. సౌదీయులు తమ ఇళ్లలో పనిచేయించుకునే వారిని ముప్పతిప్పలు పెడుతూంటారు. ముందుగానే పాస్‌పోర్టు లాగేసుకోవడంతో పనికి చేరిన చాలా మంది తప్పక ఆ నరకయాతనలోనే జీవిస్తూ ఉంటారు. తాజాగా ఓ యజమాని పనిమనిషికి వేసిన శిక్షను చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. పనిమనిషి ఇంట్లోని ఖరీదైన ఫర్నీచర్ ఎండలో ఉంచిందని.. సౌదీ యజమాని ఆమెను ఎర్రటి ఎండలో చెట్టుకి కట్టేశాడు. ఎండలో ఫర్నీచర్ ఉంచినందుకు శిక్షగా ఫిలిప్పీన్స్‌కు చెందిన లవ్‌లీ అకోస్టా(26) అనే పనిమనిషిని ఎర్రటి ఎండలో కట్టేశాడు. మరో పనిమనిషి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మే 9న జరిగిన ఈ ఘటనపై సౌదీ విదేశాంగశాఖ స్పందించి పనిమనిషిని అక్కడి నుంచి విడిపించి తిరిగి ఫిలిప్పీన్స్‌కు వెళ్లేందుకు తోడ్పాటు అందించింది. తాము ఏ చిన్న తప్పు చేసినా.. కఠిన శిక్షలు విధిస్తున్నారంటూ ఆ యజమానిపై మరో పనిమనిషి ఫిర్యాదు చేసింది.