Female-Winners-of-Asturias-Squash-Championship-gifted-Sex-Toys-

ఆస్ట్రియా స్క్వాష్ చాంపియన్‌షిప్‌.. మహిళ విజేతలకు వింత గిఫ్ట్స్...

ఆస్ట్రియా స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో మహిళ విజేతలకు ట్రోఫీలతో పాటు ఇచ్చిన ఇతర గిఫ్ట్స్ వివాదానికి దారితీశాయి. ఈ టోర్నీ నిర్వహకులు మహిళ విజేతలకు ట్రోఫీలతో పాటు సెక్స్ టాయిస్‌లను బహుమానంగా ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నలుగురు వుమెన్ విన్నర్స్‌కు ఇలాగే వైబ్రేటర్(సెక్స్ టాయ్) గిఫ్ట్‌గా అందించారు. ఈ ఏడాది స్క్వాష్ చాంపియన్‌షిప్‌ను నిర్వహించిన స్క్వాష్ ఒవీడో క్లబ్ నిర్వాకం ఇది. టోర్నీ విజేత అయిన ఎలిసాబెట్ సాడో గర్రిగ, రన్నరప్ ఓలయ ఫెర్నాండెజ్ లెన్స్‌లకు 'డురెక్స్ ప్యూర్ ఫాంటసీ వైబ్రేటర్లు'(సెక్స్ టాయిస్) గిఫ్ట్‌గా అందించారు. అలాగే మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన మరినా అర్రైజ మీర్, క్రిస్టినా బరాండిక ఫెర్నాండెజ్‌లకు కూడా సెక్స్ టాయ్‌లను బహుమానంగా ఇచ్చారు.

దీంతో విజేతలు ఆ దేశ స్క్వాష్ ఫెడరేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళలకు ఇలాంటివి గిఫ్ట్‌గా ఇవ్వడం ఏంటని వారు అసహనం వ్యక్తం చేశారు. మహిళ విజేతలకు టోర్నీ నిర్వహకులు ఇలాంటి బహుమానాలు ఇచ్చి కించపరిచారని పలువురు మండిపడ్డారు. దీంతో పాటు విజేతలు టోర్నీ నిర్వహకులపై ఫిర్యాదు చేయడంతో దిగొచ్చి క్షమాపణలు కోరారు. టోర్నీ నిర్వహించిన స్క్వాష్ ఒవీడో క్లబ్ అధ్యక్షుడు నాచొ మాన్జానొ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో ముగ్గురు సభ్యులు కూడా ఈ తప్పిదానికి బాధ్యతవహిస్తూ తమ పదవుల నుంచి తప్పుకున్నారు. మహిళల విజయానికి గుర్తింపుగా ట్రోఫీలు సరిపోతాయని, వాటితో పాటు బ్యూటీ ప్రొడక్ట్స్, సెక్స్ టాయిస్ ఇవ్వడం అనవసరమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.