Father-and-Son-Died-at-Same-Spot-in-Saudi

14 ఏళ్ల క్రితం తండ్రి చనిపోయిన అదే చోట కొడుకు కూడా...

సౌదీ అరేబియా: 14 ఏళ్ల క్రితం తండ్రి రోడ్డుప్రమాదంలో చనిపోయిన సరిగ్గా అదే చోట కొడుకు కూడా రోడ్డుప్రమాదంలోనే మృతిచెందిన విషాద సంఘటన సౌదీలో చోటుచేసుకుంది. దేశ సరిహద్దులో గార్డుగా పనిచేస్తున్న 28 ఏళ్ల వ్యక్తి ప్రయాణిస్తున్న వాహనం బోల్తాపడడంతో ఈ ప్రమాదం సంభవించింది. సౌదీలోని జఝాన్ నగరంలోని ఆల్ ఖషాల్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకోగా, అదే చోట ఇంతకుముందు అతడి తండ్రి కూడా మరణించినట్టు మృతుడి బంధువు ఒకరు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ఎడతేరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు చిత్తడిగా మారడంతో వ్యక్తి ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. జఝాన్‌లోని సౌదీ రెడ్ క్రిసెంట్ మీడియా ప్రతినిధి బిషి ఆల్ సర్ఖి మాట్లాడుతూ ఘటనాస్థలిలో బాధితుడు విషమస్థితిలో పడి ఉండగా స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న సహాయక బృందం అంబులెన్స్‌లో చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. కానీ, అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.