FANS-Living-Legend-Award-to-Coluthur-Gopalan

భారత పోషకాహార పరిశోధన పితామహుడికి 'ఫ్యాన్స్‌' లివింగ్‌ లెజెండ్‌ పురస్కారం

హైదరాబాద్‌ సిటీ: భారత పోషకాహార పరిశోధన పితామహుడిగా పేరొందిన శాస్త్రవేత్త డాక్టర్‌ కొలుతూర్‌ గోపాలన్‌ను ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏషియన్‌ న్యూట్రిషన్‌ సొసైటీస్‌ (ఫ్యాన్స్‌) అందించే లివింగ్‌ లెజెండ్‌ పురస్కారం వరించింది. ఇండోనేషియాలో జరిగిన 13వ ఆసియా పోషకాహార సదస్సులో ఈ అవార్డును ఫ్యాన్స్‌ ప్రతినిధులు అందజేశారు. పోయిన ఏడాదే వందేళ్లు పూర్తి చేసుకున్న గోపాలన్‌.. 1961 నుంచి 1973 వరకు ఐసీఎంఆర్‌, ఎన్‌ఐఎన్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన నేతృత్వంలోనే దేశంలో తొలిసారిగా 1970లో పోషకాహార కార్యక్రమలపై పరిశోధనలు జరిగాయి. విటమిన్‌-ఏ, ఐరన్‌ మాత్రల పంపిణీ ప్రారంభమైంది.