Expat-sneaks-into-room

నిద్రపోతున్న మహిళ గదిలోకి ప్రవేశించి.. ఆమె కళ్లు తెరిచేసరికి..

దుబాయి: యువతిపై అత్యాచారం చేసిన కేసులో ఓ వ్యక్తిని దుబాయి కోర్టు శిక్షించింది. దుబాయిలోని అల్‌బదా ప్రాంతంలోన ఓ విల్లాలో గది అద్దెకు తీసుకున్న ఓ మహిళ.. బంధువుల ఇంట్లో పార్టీకి వెళ్లింది. తెల్లవారుజాము 4 గంటల వరకు ఆమె అక్కడే కాలక్షేపం చేసింది. ఆ తర్వాత తన గదికి తిరిగొచ్చి పడుకుంది. ఇదే అదనుగా భావించిన ఓ 23 ఏళ్ల యువకుడు.. రహస్యంగా ఆమె గదిలో దూరాడు. నిద్రపోతున్న ఆమెను బలవంతంగా అనుభవించడానికి ప్రయత్నించాడు. ఎవరో తనపై ఉన్నట్లు అనిపించడంతో కాసేపటికి ఆ యువతి కళ్లు తెరిచింది. వెంటనే ఆమెపైనుంచి లేచిన అతను పలాయనం చిత్తగించాడు. అతన్ని వెంబడించిన ఆమె భర్త రాగానే.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. ఆ యువకుడు ఆమెను బలాత్కరించడానికి ప్రయత్నించినట్లు ధ్రువీకరించారు. గతేడాది జరిగిన ఈ ఘటనలో నిందితుడు తప్పుచేసినట్లు నిర్ధారించిన కోర్టు అతనికి జైలుశిక్ష విధించింది.