drunk-passenger-tear-off-airplanes-emergency-door

విమానం తలుపు ఊడపీకిన ప్యాసింజర్.. ప్రయాణికులంతా షాక్..

బ్యాంకాక్: విమానం మరికొద్దిసేపట్లో బయలుదేరుతుందనగా ఓ ప్రయాణికుడు చేసిన పని విమానంలోని వారందర్నీ షాక్‌కు గురిచేసింది. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో జరిగింది. మద్యం మత్తులోని ఆ ప్రయాణికుడు ఇంతకీ ఏం చేశాడో తెలుసా? అత్యవసర సమయాల్లో ఉపయోగించే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ పీకేశాడు. గురువారం ఉత్తర థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మెయ్‌లో ఓ ఎయిర్‌బస్ ఏ320 విమానం బయలుదేరబోతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

విమానంలోని ప్రయాణికుల్లో బాగా మద్యం సేవించిన ఓ వ్యక్తి అత్యవసర ద్వారం వద్దకు వచ్చాడు. మత్తులో బలవంతంగా ఆ తలుపు తీయబోయాడు. అది రాకపోవడంతో చాలాసేపు పెనుగులాడాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే తలుపును ఊడపీకాడు. ఇది చూసిన మిగతా ప్రయాణికులు పెద్దగా కేకలు వేసి సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న సిబ్బంది మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వల్ల తమకు రూ.14లక్షలపైగా నష్టం వాటిల్లిందని విమాన సంస్థ పేర్కొంది. అంతేగాక గంటపైగా విమానం ఆలస్యమైందని తెలిపింది.