Drunk-Man-Uses-Uber-to-Save-Injured-Bird

ఫుల్లుగా తాగి ఉన్న వ్యక్తి.. గాయపడిన పక్షి కోసం ఉబెర్ క్యాబ్ బుక్ చేసి..

ఉటా: తాగిన మైకంలోనూ మానవత్వాన్ని చాటాడో వ్యక్తి. గాయపడి రోడ్డు మీద పడి ఉన్న పక్షిని కాపాడేందుకు ఏకంగా ఉబెర్ క్యాబ్ బుక్ చేసి మరీ వన్యప్రాణి పునరావాస కేంద్రానికి పంపించాడు. ఈ ఘటనపై ఉత్తర ఉటాకు చెందిన వన్యప్రాణి పునరావాస కేంద్రం సిబ్బంది ఒకరు మాట్లాడుతూ గత వారం తమకు ఓ వ్యక్తి నుంచి పక్షి గాయపడి ఉన్నట్లు ఫోన్ వచ్చిందన్నారు. అయితే ఆ వ్యక్తి ఆ సమయంలో మద్యం సేవించి ఉండడంతో అతడి మాటలు సరిగ్గా అర్థం కాలేదని చెప్పారు. కానీ రోడ్డుపై గాయపడి ఉన్న పక్షిని క్యాబ్‌లో తమ వద్దకు పంపుతున్నట్లు చెప్పాడని వారు పేర్కొన్నారు. తాగిన మైకంలోనూ అతడు గాయపడిన పక్షి పట్ల చూపిన ప్రేమ, దానిని కాపాడాలనే ఆయన తపన తమకు అర్థమైందన్నారు. తాజాగా ఈ ఘటనపై ఉటా వన్యప్రాణి పునరావాస కేంద్రం తన ఫేస్‌బుక్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. వ్యక్తి తమ వద్దకు పంపించిన ఆ పక్షి ఫొటోతో పాటు పైనా చెప్పిన స్టోరీ ఆ పోస్ట్‌లో ఉంది. అలాగే ఆ పక్షికి 'పెటే' అనే పేరు పెట్టామన్నారు. ప్రస్తుతం పక్షి పూర్తిగా కోలుకుందని పునరావాస కేంద్రం డైరెక్టర్ డాలిన్ మార్తలర్ తెలిపారు. ఈ సందర్భంగా పక్షిని కాపాడిన వ్యక్తికి డాలిన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.