Dr-Zakir-Naik-now-banned-from-giving-speeches-anywhere-in-Malaysia

జకీర్ నాయక్ బహిరంగసభలపై నిషేధం విధించిన మలేషియా ప్రభుత్వం

న్యూఢిల్లీ: మలేషియా దేశంలో ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ బహిరంగ సభలపై నిషేధం విధిస్తూ మంగళవారం ఆ దేశ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. జకీర్ నాయక్ పై మలేషియాలోని హిందువులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని అతని బహిరంగసభలపై నిషేధం విధిస్తున్నట్లు ద రాయల్ మలేషియా పోలీసు కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ దాతుక్ అస్మావతి అహ్మద్ వెల్లడించారు. మలేషియాలోని మేలక, జోహోత్, సీలాంగర్, పేనంగ్, కేదాహ్, పెర్లిస్, సర్వాక్ రాష్ట్రాలు జకీర్ నాయక్ ప్రసంగాలను నిషేధించాయి.మలేషియాలోని హిందువులు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎక్కువ విధేయంగా ఉంటారని జకీర్ నాయక్ ఈ నెల 8న వ్యాఖ్యానించినట్లు వచ్చిన ఆరోపణలపై మలేషియా పోలీసులు దర్యాప్తు చేశారు. కాగా తాను చేసిన వ్యాఖ్యలపై వచ్చిన ఆరోపణలను జాకీర్ నాయక్ ఖండించారు. తాను శాంతిని కోరుకుంటానని, దీనికోసమే ప్రచారం చేస్తానని జాకీర్ వివరణ ఇచ్చారు. అనంతరం జకీర్ నాయక్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు కూడా చెప్పారు. కాగా భారతదేశంలో జకీర్ నాయక్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు ఈడీ అధికారులు మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. దీంతో జకీర్ మలేషియా దేశానికి వెళ్లి అక్కడ పర్మినెంట్ రెసిడెంట్ స్టేటస్‌ను పొందారు.

Related Articles