Door-of-Truck-Carrying-Cash-Opens-on-Atlanta-Highway

నడిరోడ్డుపై నోట్ల వర్షం.. ఎగబడిన జనం.. తిరిగి ఇచ్చేయాలంటున్న పోలీసులు...

అట్లాంటా: ఉన్నట్టుండి నడిరోడ్డుపై నోట్ల వర్షం కురిస్తే ఎలా ఉంటది. ఆ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు పండగే కదా. అమెరికాలోని అట్లాంటా హైవేపై ఇది నిజంగానే జరిగింది. ఒకటి కాదు రెండు కాదు అక్షరాల కోటి 20 లక్షలు రూపాయలు ఓ ట్రక్కు నుంచి రోడ్డుపై పడ్డాయి. కొద్దిసేపు నోట్ల వర్షం కురిసింది అక్కడ. అంతే.. అది చూసిన ఆ హైవేపై వెళ్తున్న వాహనదారులు తమ వాహనాలు నిలిపివేసి నోట్లను కలెక్ట్ చేసుకోవడం మొదలెట్టారు. ఎవరి చేతికి అందినంత వారు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ దృశ్యాలను ఓ వాహనదారుడు వీడియో తీసి అంతర్జాలంలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చేసరికి వారికి కేవలం 200 డాలర్లు మాత్రమే దొరికాయి. ఇక వీడియో తీసిన వ్యక్తి మాట్లాడుతూ చాలా దూరం నుంచి తాను రోడ్డుపై కాగితాలు పడడం గమనించానని, అయితే వాటి కోసం వాహనదారులు తమ వాహనాలు ఆపేసి మరి ఎగబడడం చూశానన్నాడు. 

దాంతో అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లి చూస్తే అవి కరెన్సీ నోట్లు కావడంతో ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చాడు. ఆ వీడియోలోని దృశ్యాల ఆధారంగా డబ్బులు తీసుకెళ్లిన వారి వాహనాల నెంబర్లను గుర్తించినట్లు రాబర్ట్ పార్సన్స్ అనే పోలీస్ అధికారి వెల్లడించారు. కనుక ఎవరెవరు ఎంతెంత తీసుకెళ్లారో వెంటనే సమీపంలోని పీఏస్‌లో అప్పగించాలన్నారు. లేనిపక్షంలో వారిపై దొంగతనం కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెడతామని హెచ్చరించారు. ఇక పోలీసుల హెచ్చరికతో ఇద్దరు మాత్రం వారు తీసుకెళ్లిన డబ్బులు తిరిగి అప్పగించారు. ఒకరు 2వేల డాలర్లు, మరొకరు 600 డాలర్లు తిరిగి ఇచ్చారు. మిగిలిన భారీ మొత్తం రావాల్సిన ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ నగదు సాయుధంగా వెళ్తున్న ఓ ట్రక్కు సైడ్ డోర్ తెరుచుకోవడం వల్ల అందులోని నగదు ఇలా రోడ్డుపై పడిందని వాహనదారులు తెలిపారు. ఆష్ఫోర్డ్-డన్‌వూడీ రోడ్ సమీపంలో అట్లాంటా హైవే ఈ ఘటన గత వారం చోటుచేసుకుంది. 

 

 

 

Video Source: P-NEWS T.V.