Donald-Trump-nominates-Indian-American-as-judge-in-Florida

ఫ్లోరిడా ఫెడరల్ జడ్జిగా భారత సంతతి వ్యక్తి?.. స్వయంగా ప్రతిపాదించిన ట్రంప్..

ఫ్లోరిడా: అమెరికన్లకే అధిక ప్రాధాన్యమంటూ ఎక్కువగా వార్తల్లో నిలిచే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ సారి దానికి పూర్తిగా విభిన్నంగా వ్యవహరించి వార్తల్లోకెక్కారు. ఫ్లోరిడా ఫెడరల్ జడ్జి నియామకానికి ఓ భారత సంతతి వ్యక్తి పేరును ప్రతిపాదించారు. ఈ మేరకు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఫ్లోరిడా ఫెడరల్ జడ్జి నియామకానికి అర్హతలున్న 17 మంది పేర్లను ప్రభుత్వం సెనేట్‌కు సూచించింది. వాటిలో భారత సంతతికి చెందిన అనురాగ్ సింఘాల్ పేరు కూడా ఉంది. సెనేట్ గనుక అనురాగ్ పేరును ఆమోదిస్తే, ఈ ఘనత సాధించిన తొలి భారత అమెరికన్‌గా ఆయన చరిత్ర సృష్టిస్తారు. 2011 నుంచి ఫ్లోరిడాలోని 17వ సర్క్యూట్‌లో ఆయన జడ్జిగా ఉన్నారు. 1960లో ఆయన తల్లిదండ్రులు అమెరికా వలస వెళ్లారు. రైస్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందిన అనురాగ్.. వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ లాలో న్యాయవిద్య అభ్యసించారు. అప్పట్లో ఏడుగురు వ్యక్తులను ఊచకోత కోసి, ఫ్లోరిడాను వణికించిన సీరియల్ కిల్లర్ ఎయిలీన్ వోర్నస్ కేసు వాదించి అనురాగ్ వార్తల్లో నిలిచారు. తొలుత ఈ కేసు వాదించడానికి ముందుకురానప్పటికీ, జైలు అధికారులపై ఎయిలీన్ చేసిన ఆరోపణలు విని కేసు ఒప్పుకున్నారు. 

Related Articles