Delaware-man-chokes-Walmart-cashier-in-Florida

మహిళా క్యాషియర్ నోరు నొక్కేసి.. అమెరికాలో ఓ వ్యక్తి..

ఫ్లోరిడా: మద్యం మత్తులో ఓ మహిళపై దాడికి పాల్పడిన వ్యక్తిని ఫ్లోరిడా పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారుల కథనం ప్రకారం.. పీటర్ మెక్‌గాగ్రన్(32) అనే వ్యక్తి అక్టోబర్ 2వ తేదీన ఫ్లోరిడాలోని వాల్‌మార్ట్ స్టోర్‌కు వెళ్లాడు. సాయంత్రం 5.30 గంటల సమయంలో కౌంటర్ వద్ద నిలబడుతూ.. ఒక్కసారిగా కౌంటర్ వెనుక నుంచి వచ్చి మహిళా క్యాషియర్ నోరు నొక్కేశాడు. పైనున్న వీడియోలో ఈ ఘటనను చూడవచ్చు. దీంతో మహిళకు ఊపిరాడక కొద్దిసేపు నరకాన్ని అనుభవించింది. ఇంతలో ఆమె సహఉద్యోగులు సీసీ కెమెరాల ద్వారా ఈ దృశ్యాన్ని చూసి వెంటనే అక్కడకు చేరుకున్నారు. పీటర్‌ను బలవంతంగా లాగి మహిళను రక్షించారు. పోలీసులకు వెంటనే సమాచారమివ్వగా.. అక్కడకు చేరుకుని పీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాను ఏం చేస్తున్నాడన్న విషయం కూడా తెలియనంతగా పీటర్ మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

Video Source: ThisIsButter