Dead-dog-digs-out-of-its-GRAVE-and-returns-to-its-stunned-Russian-owners-whod-buried-it

చనిపోయిందనుకుని కుక్కను పాతిపెట్టారు.. కాసేపు తరువాత..

రష్యా: రష్యాలోని క్రాయ్ అనే ప్రాంతంలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఎన్నో ఏళ్ల నుంచి అక్క చెల్లెల్లు అపురూపంగా పెంచుకుంటున్న కుక్క ఎంత లేపినా లెగకపోవడంతో చనిపోయిందని భావించిన యజమానులు కుక్కను ఓ చోటకు తీసుకెళ్లి గోతిలో పాతిపెట్టారు. అనంతరం అక్కడ నుంచి అందరూ వెళ్లిపోగా.. కాసేపు తరువాత కుక్క తనంతట తానే గోతిలో నుంచి పైకి వచ్చేసింది. హైవేపై తిరుగుతున్న కుక్కను చూసిన ఓ వ్యక్తి కుక్కను పెట్ షెల్టర్ వారికి అందించాడు. ఆ సంస్థ డిక్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా.. ఈ పోస్ట్‌ను చూసిన కుక్క యజమానులు షాక్ అయ్యారు. చనిపోయిందనుకుని పాతిపెట్టిన కుక్క బతికే ఉందా అనుకుని ఆనందపడ్డారు. పెట్ షెల్టర్‌కు వెళ్లి తమ కుక్కను తెచ్చుకున్నారు. తమ కుక్కను తిరిగి ఇచ్చినందుకు గాను షెల్టర్ యజమానికి 60 పౌండ్ల పారితోషికం కూడా ఇచ్చారు. కాగా, ఈ వార్తపై నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్టీఫెన్ హాకింగ్ నవలల్లోనే ఇలాంటివి జరిగినట్టు తెలుసని.. బయట కూడా ఇలాంటివి జరుగుతాయని తెలీదంటూ కామెంట్లు చేస్తున్నారు.