City-police-intensified-searches-in-foreign-students-houses

హైదరాబాద్‌లోని విదేశీ విద్యార్థుల ఇళ్లలో సోదాలు

హైదరాబాద్: నగరంలో నివాసం ఉంటున్న విదేశీ విద్యార్థుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. విదేశీ విద్యార్థుల కదలికలను అనుమానిండంతో.. నగరంలో 8 చోట్ల ఏకకాలంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలీచౌకి, ఆసిఫ్ నగర్, మై నగర్, ఉస్మానియా తదితర ప్రాంతాల్లో సోదాలు అధికారులు సోదాలు నిర్వహించారు. టోలిచౌకి, పారామౌంట్ కాలనీలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఎస్బీ అధికారులు, 200 మంది పోలీసులు పాల్గొన్నారు. నైజిరియన్‌ల వీసా గడువు, పాస్ పోర్ట్‌లను తనిఖీ చేస్తున్నారు. వీసా గడువు ముగిసిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు