Chance-to-Indians-to-Visit-Uzbekistan-without-a-Visa-from-Next-Year

ఇకపై ఆ దేశానికి వెళ్లే ఇండియన్స్‌కు వీసా అవసరం లేదు...

వీసా అవసరం లేకుండా ఉజ్బెకిస్తాన్‌కు..!

వచ్చే సంవత్సరం నుంచి అవకాశం
ఆ దేశ రాయబారి ఫర్హోద్‌ అర్జీవ్‌

హైదరాబాద్‌: వీసా అవసరం లేకుండా భారతీయులు ఉజ్బెకిస్తాన్‌ను సందర్శించే అవకాశాన్ని వచ్చే ఏడాది నుంచి కల్పించనున్నట్టు ఆ దేశ రాయబారి ఫర్హోద్‌ అర్జీవ్‌ తెలిపారు. హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మేయర్‌ రామ్మోహన్‌ను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు చర్చించారు. భారత్‌, ఉజ్బెకిస్తాన్‌కు దశాబ్దాలుగా మెరుగైన దౌత్య సంబంధాలున్నాయని, తాస్కెంట్‌ ఒప్పందమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. హైదరాబాద్‌, ఉజ్బెకిస్తాన్‌లోని 2,500 సంవత్సరాల చరిత్ర ఉన్న బోహ్ర నగరాల మధ్య త్వరలో సిస్టర్‌ సిటీ ఒప్పందం జరుగనుందని చెప్పారు.

ఈ రెండు నగరాల మధ్య సాంస్కృతిక, విద్య, వ్యాపార రంగాల్లో సత్సంబంధాల ఏర్పాటుకు ఆ ఒప్పందం దోహదపడుతుందన్నారు. ఇక్కడి చలనచిత్ర పరిశ్రమను ఉజ్బెకిస్తాన్‌కు ఆహ్వానిస్తున్నామని, తమ దేశంలో ఆకర్షణీయ, చారిత్రక, పర్యాటక కేందాల్రున్నాయని పేర్కొన్నారు. ఉస్మానియా, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఎంతో మంది విద్యార్థులున్నారని తెలి పారు. తమ దేశంలో ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు విస్తృత అవకాశాలున్నాయన్నారు. ఈ సందర్భంగా ఫర్హోద్‌ అర్జీవ్‌ను రామ్మోహన్‌ శాలు వా, జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం కమాండ్‌ కంట్రోల్‌ రూంలో వర్షం, ట్రాఫిక్‌ నియంత్రణపై ఆయనకు వివరించారు.