California-restaurant-offers-free-pizza-to-diners-who-lock-away-their-phones

ఇలా చేస్తే ఓ లార్జ్ పిజ్జా ఫ్రీగా ఇస్తారట..

కాలిఫోర్నియా: చేతిలో సెల్‌ఫోన్ లేకుండా ఉండేవారిని ఇప్పుడున్న సమాజంలో ఎక్కడా చూడలేం. అంతలా సెల్‌ఫోన్ మనిషి జీవితంలో భాగమైపోయింది. అమెరికాలోని ఓ పిజ్జా కంపెనీ మనిషి నుంచి సెల్‌ఫోన్‌ను దూరం చేసి, ఆత్మీయులకు దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఓ ఆఫర్‌ను తీసుకొచ్చింది. రెస్టారెంట్‌కు వచ్చిన వారు లాకర్లలో తమ ఫోన్ పెట్టి.. తిరిగి వెళ్లే వరకు ఫోన్ ముట్టుకోకపోతే వారికి ఓ లార్జ్ పిజ్జా ఉచితంగా ఇస్తామనే ఆఫర్ పెట్టింది. ఈ పిజ్జాను కావాలంటే పార్శిల్ తీసుకెళ్లచ్చు.. లేదా ఎవరికైనా డొనేట్ చేయవచ్చు అని కూడా చెప్పింది. మనిషి సెల్‌ఫోన్ మాయలో పడి కనీసం ఇంట్లో వాళ్లతో కూడా ఆనందంగా గడపడం లేదని రెస్టారెంట్ సహ యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను కూడా ఇలానే గడిపేవాడినని.. కొద్దిరోజుల క్రితం సెల్‌ఫోన్ వాడకం తగ్గించాక జీవితం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన పిల్లలకు ఇప్పుడు ఎంతో సమయన్ని కేటాయిస్తున్నానన్నారు. తనలాగే మిగతా వారు కూడా ఉండాలని ఈ ఆఫర్‌ను తెచ్చామన్నారు. అయితే ఈ ఆఫర్‌ను పొందాలంటే రెస్టారెంట్‌కు కనీసం నలుగురు స్నేహితులు రావాల్సి ఉంటుంది.