Bride-to-be-smashes-friends-head-

కాబోయే వాడితో ఎఫైర్ పెట్టుకుందని.. స్నేహితురాలి జుట్టు పట్టుకొని..

లండన్: బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ స్నేహితురాలి మోసాన్ని తట్టుకోలేకపోయింది. తన ప్రయుడితో ఆమె ఎఫైర్ పెట్టుకుందని తెలిసి ఆగ్రహంతో ఊగిపోయింది. కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నామని, ప్రియుడితో కలిసి ఓ అపార్ట్‌మెంట్లో ఉంటున్న 37 ఏళ్ల హెలెన్ హోకెన్.. ఇంటికి దగ్గరలోనే తన మిత్రురాలిని చూసింది. ఆమె తన ప్రియుడితో అక్రమసంబంధం పెట్టుకుందని తెలుసుకున్న హెలెన్ కోపం కట్టలు తెంచుకుంది. అంతే తన మిత్రురాలు కరోల్ క్లార్క్‌సన్ జుట్టు పట్టుకొని బలంగా నేలకేసి కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కరోల్‌ను స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. హెలెన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా.. ఆమె తన నేరాన్ని అంగీకరించింది. కరోల్ ప్రాణానికి ఎటువంటి ముప్పూ లేదని పోలీసులు చెప్పారు. కేసుపై విచారణ చేసిన కోర్టు.. హెలెన్‌కు పదినెలల జైలుశిక్ష విధించింది.