థింపు: భూటాన్ వెళ్లే భారతీయ సందర్శకులు ఇకపై ప్రవేశ రుసుము కింద రోజుకు రూ. 1200 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆ దేశ దిగువ సభ సోమవారం ఒక బిల్‌ను ప్రవేశపెట్టింది. భారత్‌తో పాటు బంగ్లాదేశ్, మాల్దీవులకు చెందిన పర్యాటలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని భూటాన్ పర్యాటక అధికారులు పేర్కొన్నారు. జూలై నుంచి ఈ నిబంధనలు అమలు చేయనున్నారు. భూటాన్ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ మూడు దేశాల నుంచి 2018లో భూటాన్‌లో పర్యటించిన వారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఇలా ప్రతి సంవత్సరం పర్యాటకుల సంఖ్య పెరుగుతుండడంతో వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు.. పర్యాటక రంగం అభివృద్ధి పరిచే యోచనలో భూటాన్ ఉంది. అందుకే ఈ నామినల్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది.