Awful-Incident-Occured-when-Chinese-Man-Tries-to-Kill-Cockroach-With-Fire-and-Insecticide

బొద్దింకలను చంపబోతే.. చివరకు జరిగిందిదీ..

బీజీంగ్: ఇంట్లో బొద్దింకులు ఎక్కువగా ఉంటే ఏం చేస్తాం. క్రిమి సంహారకాలు, స్ప్రేలు వాడి వాటిని నివారించేందుకు ప్రయత్నిస్తాం. కామన్‌గా అందరూ చేసేది ఇదే. కానీ చైనాలో ఓ వ్యక్తి బొద్దింకల నివారణకు అనుసరించిన పద్ధతి, దానివల్ల కలిగిన నష్టం ఏంటో తెలిస్తే షాకవుతారు. మనోడు క్రిమి సంహారక మందు అయితే వాడాడు.. కాని దానితో పాటు నిప్పును కూడా ఉపయోగించాడు. ఇదే అతడి కొంపముంచింది. అతడు వాడిన క్రిమి సంహారక మందుకు మండే లక్షణం ఉండడంతో ఒక్కసారిగా మంటలు ఇంట్లోంచి బయటకు భగ్గుమన్నాయి. దీంతో ఇంటి బయట ఆగి ఉన్న మూడు కార్లు ఆ మంటల్లో బుగ్గి అయ్యాయి. ఈ సంఘటన క్వాన్జౌలోని ఫుజియన్ నగరంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం చైనీస్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.