Aurobindo-Pharma-Recalls-Ranitidine-Drugs-In-US

యూఎస్‌లో అరబిందో రానిటిడిన్‌ టాబ్లెట్లు, సిరప్స్ వెనక్కి

హైదరాబాద్‌: అమెరికా మార్కెట్‌ నుంచి రానిటిడిన్‌ టాబ్లెట్లు, సిరప్లను అరబిందో ఫార్మా యూఎస్ ఐఎన్‌సీ స్వచ్ఛందంగా వెనక్కి రప్పించింది. 38 లాట్ల రానిటిడైన్‌ టాబ్లెట్లు (150 ఎంజీ), గొట్టాలు (150, 300 ఎంజీ), సిరప్‌ (15 ఎంజీ/ఎంఎల్‌)లను కంపెనీ వెనక్కి తీసుకుందని యూఎస్ఎఫ్‌డీఏ వెల్లడించింది. రానిటిడిన్‌ ఔషధాల్లో ఎన్‌డీఎంఏ (నైట్రోసోడి మిథైలమైన్‌) మలినాలు ఉన్నట్లు కనుగొనడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అరబిందో రానిటిడిన్‌ ఔషధాన్ని వినియోగించడం వల్ల ఎటువంటి ప్రతికూల సంఘటనలు జరిగినట్లు సమచారం లేదని అరబిందో తెలిపింది.