Asian-Taxi-Driver-Honesty-

నిజాయితీ చాటుకున్న టాక్సీవాలా.. భారీ మొత్తంలో నగదు అప్పగింత...

రాస్ అల్ ఖైమాహ్: ప్రయాణికుడు తన క్యాబ్‌లో మరిచి వెళ్లిపోయిన 100,000 దిర్హామ్(రూ. 18,89,770)లను తిరిగి పోలీసుల ద్వారా అతడికి అందించి నిజాయితీ చాటుకున్నాడు ఆసియాకు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్. ఈ సందర్భంగా టాక్సీడ్రైవర్ కుషు ఇబ్రాహీంను రాస్ అల్ ఖైమాహ్ పోలీసులు సన్మానించి ప్రశంస పత్రాన్ని అందజేశారు. ఆర్ఏకే పోలీస్ అధికారి అబ్దుల్హా అలీ మెనఖాస్ మాట్లాడుతూ డ్రైవర్ కుషు నిజాయితీని మెచ్చుకున్నారు. తన టాక్సీలో ప్రయాణికుడు భారీ నగదు గల బ్యాగును మరిచిపోవడం గుర్తించిన కుషు రెండో ఆలోచన చేకుండా పోలీసులకు సమాచారం అందించడం అభినందనీయం అని అన్నారు. ఇలాంటి వారు మిగతా డ్రైవర్లకు ఆదర్శమని ఆయన కొనియాడారు. గుర్తుతెలియని ప్రయాణికుడు కారులో నగదు మరిచి వెళ్లిపోయిన విషయాన్ని తమకు తెలియజేయడంతో వెంటనే ఆ వ్యక్తిని గుర్తించి డబ్బులు అతడికి అందించగలిగామని పోలీస్ అధికారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిజాయితీగా నగదును తిరిగి ఇచ్చిన డ్రైవర్‌తో పాటు ఆ డబ్బులు తనకు తిరిగి చేరడంలో సహకరించిన పోలీసులకు ప్రయాణికుడు కృతజ్ఞతలు తెలిపాడు.  

 

Related Articles