Another-Bangladeshi-actor-asked-to-leave-country-for-election-campaigning

బంగ్లా నటుడిని దేశం విడిచి వెళ్లిపోమన్న కేంద్రం

న్యూఢిల్లీ: భారత్‌ను విడిచి వెళ్లాలంటూ మరో బంగ్లా నటుడిని కేంద్రం ఆదేశించింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఘాజీ అబ్దుల్‌ నూర్‌ అనే నటుడు, తన వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉండటంతో పాటు, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడని బెంగాల్‌ బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో, వీసా నిబంధనలను అతిక్రమించినందుకు దేశం విడిచి వెళ్లాలని నూర్‌కు కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది. కాగా.. మరో బంగ్లా నటుడు ఫెర్డోస్‌ అహ్మద్‌కు కూడా కేంద్రం మంగళవారం ఇదే తరహాలో ఆదేశాలు జారీచేసింది. బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో తృణమూల్‌ తరపున అహ్మద్‌ ప్రచారం చేశాడు. దీంతో అతడికి ఇచ్చిన బిజినెస్‌ వీసాను సైతం కేంద్రం రద్దు చేసింది.