Anita-Anand-First-Hindu-Woman-in-Canada-Cabinet

కెనడా మంత్రివర్గంలో హిందూ మహిళ

అట్టావా: కెనడాలో తొలిసారి ఓ హిందూ మహిళ మంత్రి అయ్యారు. టొరంటో వర్సి టీ ప్రొఫెసర్‌ అనితా ఆనంద్‌ ప్రజాసేవలు, సేకరణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మరో ముగ్గురు సిక్కులు నవదీప్‌ బెయిన్స్‌(42), బర్దిష్‌ చగ్గర్‌(39), హర్జిత్‌ సజ్జన్‌(49) కూడా మంత్రి పదవులు పొందారు. కెన డా ప్రధానిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన జస్టిన్‌ ట్రూడో 37మందితో కేబినెట్‌ను ఏర్పాటు చేశారు.