Amazon-package-had-dirty-diapers-in-it-family-says

డెలివరీ ఐటమ్ ఓపెన్ చేసి.. కంగుతిన్న అమెరికన్ యువతి

జెర్సీ సిటీ: అమెరికాకు చెందిన ఓ యువతికి ఆన్‌లైన్ షాపింగ్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. తను చేసిన పొరబాటు వల్ల నెలల వయసున్న కుమార్తె ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉండటంతో ఆమె భయాందోళనలకు గురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జెర్సీ సిటీకి చెందిన నాస్లే సేల్స్ అనే యువతికి ఇటీవలే ఓ పాప పుట్టింది. దాదాపు రెండు నెలల ముందే ప్రిమెచ్యూర్‌గా పుట్టిన ఆ పాప రోగనిరోధక శక్తి తక్కువగా ఉంది. దీంతో పాపకు ఎటువంటి వ్యాధులూ రాకుండా నాస్లీ చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఈ క్రమంలోనే పాప కోసం ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌లో డైపర్స్ ఆర్డర్ ఇచ్చింది. అవి వచ్చిన తర్వాత పాపకు తొడగడం కోసం వాటిని ఓపెన్ చేయగా.. వాటిలో మానవ విసర్జితాలు ఉన్నట్లు ఆమె గుర్తించింది. వెంటనే పాపను పక్కకు తీసుకెళ్లి స్నానం చేయించి, ఈ ఘటనను అమెజాన్ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన అమెజాన్ ప్రతినిధులు నాస్లీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.