Al-Qaeda-releases-maiden-video-on-Kashmir

పాక్ సైన్యం, ప్రభుత్వం అమెరికా తొత్తులే: అల్‌కయిదా చీఫ్ అల్‌జవహరి

ల్‌కయిదా చీఫ్ అల్‌జవహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన 14 నిమిషాల వీడియో ప్రసంగంలో అనేక విషయాలను ప్రస్తావించారు. కశ్మీర్‌లో ఇస్లామిక్‌ పాలన కోసం ముస్లింలు అందరూ కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. జిహాద్‌కు సిద్ధం కావాలని, భారత సైన్యం, ప్రభుత్వంపై కశ్మీర్‌ ముజాహిదీన్‌లు దెబ్బ మీద దెబ్బ వేయాలంటూ రెచ్చగొట్టారు. ఇదొక్కటే లక్ష్యం కావాలని చెప్పారు. పాకిస్థానీలు సైతం నమ్మదగినవారు కాదని, పాక్‌ సైన్యం, ప్రభుత్వం అమెరికా తొత్తులేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాను, దాని ఏజెంట్లను తరిమికొట్టేవరకు ముస్లింలు విశ్రమించరాదని అన్నారు.