Airport-Worker-Gives-Passenger-A-Note-Saying-You-Ugly-In-New-York-and-Gets-Fired

‘నువ్వు దరిద్రంగా ఉన్నావ్’ అంటూ ప్యాసెంజర్‌కు రాసిచ్చిన ఎయిర్‌పోర్ట్ మహిళా సిబ్బంది

న్యూయార్క్: ‘నువ్వు దరిద్రంగా ఉన్నావ్’(యూ అగ్లీ) అంటూ విమానశ్రయంలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగిని ఓ ప్యాసెంజర్‌కు చెప్పడంతో అధికారులు ఆమెను విధుల నుంచి బహిష్కరించారు. స్ట్రాస్‌నర్ అనే వ్యక్తికి న్యూయార్క్‌లోని గ్రేటర్ రోచెస్టర్ ఎయిర్‌పోర్టులో ఈ వింత అనుభవం ఎదురైంది. జూన్‌లో ఈ సంఘటన జరగగా తాజాగా ఉద్యోగినిని ఉద్యోగం నుంచి పంపించేశారు. పైనున్న వీడియోను పరిశీలిస్తే.. స్ట్రాస్‌నర్ ఎయిర్‌పోర్ట్‌లోని లగేజీ కౌంటర్ వద్ద మెటల్ డెటెక్టర్ దాటి వెళ్తున్న సమయంలో.. అక్కడే ఉన్న ఓ మహిళా ఉద్యోగిని స్ట్రాస్‌నర్ చేతికి ఓ కాగితం ఇచ్చింది. తెరిచి చూడమంటూ సూచించింది. స్ట్రాస్‌నర్ ముందుకు వెళ్లిపోయి ఆ కాగితం తెరవగా.. అందులో యూ అగ్లీ(చండాలంగా ఉన్నావ్) అంటూ రాసి ఉంది. స్ట్రాస్‌నర్ జరిగిన సంఘటనను సూపర్‌వైజర్‌ దృష్టికి తీసుకెళ్లాడు. ఇలాంటి వాటిని తాము ఉపేక్షించమంటూ పైఅధికారులు ఆ మహిళను ఉద్యోగం నుంచి తీసేశారు.

Video Source: What you see what you get

Related Articles