African-Teen-Gives-Birth-During-High-School-Exam-and-Returns-To-Finish

ఎగ్జామ్ హాల్‌లో పురిటి నొప్పులు.. అటు పిల్లోడిని కని.. ఇటు ఎగ్జామ్ రాసి..

కోనక్రీ: సంవత్సరం మొత్తం కష్టపడి చదివేది.. ఆ ఒక్కరోజు కోసమే. ఆ ఒక్క పరీక్ష రాయకపోతే.. చేతికి రావాల్సిన డిగ్రీ చేజారిపోతుంది. మళ్లీ రాయాలంటే సంవత్సరం ఆగాల్సి రావచ్చు. పశ్చిమ ఆఫ్రికాలోని గునియా దేశానికి చెందిన ఫటౌమాటా కౌరౌమా(18) కూడా సరిగ్గా ఇలానే ఆలోచించినట్టు ఉంది. నెలలు నిండిన గర్భంతో కౌరౌమా ఫిజిక్స్ ఫైనల్ పరీక్ష రాయడానికి ఎగ్జామ్ హాల్‌లో కూర్చుంది. పరీక్ష మొదలైన కాసేపటికే కౌరౌమాకు పురిటి నొప్పులు రావడం ప్రారంభమయ్యాయి. ఇన్విజిలేటర్లు, కాలేజీ అధికారులు కౌరౌమాను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. పదినిమిషాల్లో ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కౌరౌమా కేవలం 40 నిమిషాల్లో తిరిగి ఎగ్జామ్ హాల్‌కు చేరుకుంది. దీంతో ఇన్విజిలేటర్లు, తోటి విద్యార్థులు షాక్ అయ్యారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న కౌరౌమా భర్త తన భార్య చేసిన పనికి భయపడినప్పటికీ.. గర్వంగా ఫీలవుతున్నాడు. తమ బిడ్డ చాలా బాగా చదువుతుందని, అందుకే పరీక్ష రాయాలనే కసితో ఆసుపత్రి నుంచి ఇంటికి కాకుండా.. ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లిందని కౌరౌమా కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కౌరౌమా పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటున్నామని అన్నారు.