Abu-Dhabi-Police-Seek-Public-Help

రోడ్డుప్రమాదంలో గాయపడిన వ్యక్తి.. ప్రజల సాయం కోరుతున్న అబుదాబి పోలీసులు...

అబుదాబి: రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని గుర్తించేందుకు అబుదాబి పోలీసులు ప్రజల సాయం కోరుతున్నారు. గాయపడిన వ్యక్తి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లభించకపోవడంతో అతణ్ణి గుర్తించేందుకు పోలీసులు పబ్లిక్ హెల్ప్ కోరుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి ఫొటోను విడుదల చేసిన పోలీసులు ఎవరికైనా అతడికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసిన అబుదాబి ట్రాఫిక్ పోలీస్ విభాగానికి (లేదా) మఫ్రాక్ పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలన్నారు. సమాచారం తెలిసిన వారు 025136994, 025065356 నెంబర్లకు కాంటాక్ట్ చేయాలని పోలీసులు తెలిపారు.