85000-year-old-footprints-found-in-kingdom

85 వేల ఏళ్ల నాటి పాదముద్రలు గుర్తింపు

రియాద్: గల్ఫ్ దేశం సౌదీఅరేబియా గుండా పూర్వం రాకపోకలు సాగేవనే విషయాన్ని తెలియజేసే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 85 వేల ఏళ్ల నాటి మానవ పాదముద్రలను సౌదీలోని ఎడారిలో పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. అరేబియా వాయువ్య ప్రాంతమైన తబుక్ ప్రాంతంలో ఈ పాదముద్రలను గుర్తించారు. నఫుడు ఎడారి ప్రాంతంలో పురాతన కాలంలో ఉన్న సరస్సు ఒడ్డుపై ఈ ముద్రలను గుర్తించారు. పాదముద్రలు పెద్దవారివిగా నిర్ధారించారు. జపాన్‌లోని టోక్యో నగరంలో ఉన్న మ్యూజియంలో సౌదీఅరేబియా ద్వారా రోడ్డు మార్గాలు ఉండేవని, రాకపోకలు సాగేవని పేర్కొని ఉందని, పాదముద్రలు వెలుగులోకి రావడం విషయాన్ని బలపరుస్తోందని సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ అధ్యక్షుడు సుల్తాన్ బిన్ సాల్మాన్ అభిప్రాయపడ్డారు. సరస్సుకు నలువైపులా పాదముద్రలు గుర్తించామన్నారు. ఆఫ్రికా నుంచి వలస వెళ్లిన వారి పాదముద్రలుగా భావిస్తున్నామని, ఆఫ్రికా నుంచి ప్రపంచ వ్యాప్తంగా వలసలు ఏవిధంగా ఉన్నాయనే విషయాన్ని ఈ పాదముద్రలు చూచిస్తున్నామని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.