74-Years-After-World-War-II,-Remains-of-People-Killed-in-Hitlers-Regime-to-Be-Buried-in-Berlin

రుతుస్రావం మీద పరిశోధన చేయడం కోసం.. చనిపోయిన యువతులను..

 

బెర్లిన్: రెండో ప్రపంచయుద్దంలో మరణించిన అనేక మంది శవాలను ఓ అనాటమీ డాక్టర్ తన ఇంట్లో పెట్టుకున్నట్టు బెర్లిన్‌కు చెందిన ఓ మెమోరియల్ కనుగొంది. మే 13న వారికి అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. రెండో ప్రపంచయుద్దం జరిగే సమయంలో స్టీవ్ అనే అనాటమీ(శరీర నిచ్చేధ శాస్త్రం) డాక్టర్ నాజీల చేతిలో మరణించిన వారి శవాలను కొంతమంది అధికారుల సహాయంతో పరిశోధన కోసం తన ఇంటికి తీసుకెళ్లేవాడని మెమోరియల్ అధికారులు చెప్పారు. మహిళల రుతుస్రావం మీద స్టీవ్ పరిశోధనలు చేసేవాడని.. అందుకని ఎక్కువగా యువతుల శవాల్ని తీసుకెళ్లేవాడని అధికారులు గుర్తించారు. ఆ సమయంలో మొత్తం 184 శవాలను పరిశోధన కోసమని తీసుకెళ్లగా.. వారిలో 172 మంది యువతులేనని తెలిసింది. 1952లో గుండెనొప్పితో స్టీవ్ మరణించగా.. అతని ఇంట్లోనే అనేక శవాల శరీర భాగాలు ఉంటూ వచ్చాయి. 2016లో స్టీవ్ వారసుల ద్వారా ఈ విషయం బయటపడింది. స్టీవ్ పరిశోధన గదికి అధికారులు వెళ్లగా అనేక మంది శరీర భాగాలు చిన్న చిన్న గ్లాసులలో దొరికాయి. ఆ శరీర భాగాలు మొత్తం రెండో ప్రపంచ యుద్దంలో చనిపోయిన వారివేనని వారు గుర్తించారు. యుద్దం జరిగే సమయంలో స్టీవ్ ఓ డ్రైవర్‌ను పెట్టుకున్నట్టు, అతడే ఈ శవాలను యుద్ద ప్రాంతం నుంచి ల్యాబ్‌కు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.