4yr-old-Boy-dies-after-five-hour-wait-for-doctor

5 గంటలు డాక్టర్ల కోసం వెయిట్ చేసిన పసివాడు.. వాళ్లు వచ్చేసరికి..

స్కాట్లాండ్: ఓ నాలుగేళ్ల పిల్లాడికి ఒంట్లో బాగాలేదు. ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ వంటి మానసిక వ్యాధులతో బాధపడుతున్న ఆ చిన్నారి.. తన బాధను వైద్యులకు స్పష్టంగా చెప్పలేకపోయాడు. అలా చెప్పలేకపోవడమే అతని పాలిట యమపాశమైంది. అతని వ్యాధి అంత సీరియస్‌ కాదని అనుకున్న డాక్టర్లు.. వైద్యాన్ని ఆలస్యం చేశారు. దాంతో ఆ పిల్లాడు మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. స్కాట్లాండ్‌లోని మోంట్రోస్‌లో ఉంటున్న లేలాన్ ఫోర్ట్ అనే 4ఏళ్ల బాలుడికి నోరోవైరస్ సోకింది. దీని వల్ల శరీరంలో డీహైడ్రేషన్, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.

కుమారుడికి బాగాలేదని గుర్తించిన లేలాన్ తల్లి.. ఉదయం 6గంటలకే అతన్ని ఆస్పత్రికి చేర్చింది. ఆటిజంతో బాధపడే లేలాన్.. వైద్యులకు తన సమస్యను స్పష్టంగా వివరించలేకపోయాడు. దాంతో అతని ట్రీట్‌మెంటును ఆలస్యం చేసిన వైద్యులు.. 11గంటలకు మళ్లీ అతన్ని సంప్రదించారు. అయితే అప్పటికే లేలాన్ మరణించాడు. లేలాన్ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని అతని తల్లి ఆరోపించింది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. లేలాన్ మరణంపై అత్యవసర దర్యాప్తు చేయాలని పోలీసులను  ఆదేశించింది.