150-Secret-Dog-Fighting-Rings-In-Australia

ఆ దేశంలో కుక్కల ఫైటింగ్‌ల కోసం.. రహస్యంగా 150 బరులు..

కాన్‌బెర్రా: జంతువులను హింసించకూడదంటూ ఓ పక్క ప్రపంచవ్యాప్తంగా చట్టాలు చేస్తుంటే.. ఆస్ట్రేలియాకు చెందిన కొందరు మాత్రం ఆ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. ప్రపంచంలో బాగా పేరొందిన జాతులకు చెందిన వేట కుక్కల వీర్యాన్ని సేకరించి, దాంతో రహస్యంగా ఆయా రకాల కుక్కలను పెంచుతున్నారు. అలా పెంచిన కుక్కల మధ్య ఫైటింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. కోడి పందేల్లాంటి వీటిపై ఆస్ట్రేలియా వ్యాప్తంగా నిషేధం ఉంది. అయినాసరే ఈ మాఫియా ప్రస్తుతం చాలా బలం తయారైందని, పోలీసులు జరిపిన తనిఖీల్లో దాదాపు 150 ఫైటింగ్ రింగ్స్ వెలుగుచూసినట్లు సమాచారం. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలను తాము సహించబోమని, వీటికి కారణమైన వారిని త్వరలోనే పట్టుకుంటామని వారు పేర్కొన్నారు.