బ్రెజిల్:కన్న తల్లినే కడతేర్చాలని చూసిందో మహిళ. ఆసుపత్రిలో నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లిని ఊపిరి ఆడకుండా చేసి చంపాలనుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌కు చెందిన అనా బెనెడిటా (68) కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆమెను మరన్హో నగరంలోని హాస్పిటల్‌లో చేర్చి, చికిత్స చేయిస్తున్నారు. అయితే.. అనారోగ్యంతో మంచాన పడి ఉన్న కన్న తల్లికి సేవ చేయడం భారం అనుకుందో.. లేక సంపాదించిన కాసులు అయిపోతున్నాయనుకుందో. మొత్తానికి అనా బెనెడిటాను ఆమె కూతురు లూసియానా హతమార్చాలనుకుంది. ముక్కు, నోరు మూసి అనా బెనెడిటాకు ఊపిరాడకుండా చేసింది. ఈ నేపథ్యంలో పక్క బెడ్‌పై ఉన్న పేషెంట్ లుసియానా చేసిన పనిని వీడియో తీసి డాక్టర్లకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన డాక్టర్లు.. అనా బెనెడిటాను ఐసీయూలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లిని హత్య చేయడానికి ప్రయత్నించిన లూసియానాను పోలీసులు అరెస్టు చేసి, కటకటాల వెనక్కి నెట్టారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి